దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని పాటించాలని ఆదేశించింది.
ఈ మేరకు బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని సూచిస్తూ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.