
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.2,600 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్లో మూడు టిమ్స్ ఆసుపత్రులు మరియు వరంగల్ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.