
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద కంటైనర్ బోల్తా పడటంతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు, క్రేన్ సాయంతో కంటైనర్ను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సుమారు మూడు గంటలుగా వాహనదారులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.