
తీవ్ర తుపాను మురసు మంగళవారం తెల్లవారుజామున ఒంగోలుకు అతి సమీపాన తీరం దాటిందని, ఆ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు కుండపోతగా వర్షాలు కురిశాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ భారతదేశంపై అరేబియా సముద్రం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న రెండు అధిక పీడనాలు బలంగా ఉండడంతో తుపాను పయనంలో వేగం తగ్గినట్లు ఇస్రో వాతావరణ నిపుణుడు విశ్లేషించారు.