
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే పీ2పీ యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం.
చిన్న వ్యాపారుల కోసం రూ.2,000 వరకు జరిగే మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి MDR చార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రూ.2,000 దాటిన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుందని, వినియోగదారులపై ఎలాంటి భారం పడదని వెల్లడించారు.