
అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను అరికట్టేందుకు ఓటీటీలు, వాట్సాప్, సోషల్ మీడియాలను కూడా కలుపుతూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త ముసాయిదా రూపొందించింది.
కంపెనీలు ప్రమోషనల్ మెసేజ్‌లు పంపాలంటే వినియోగదారుడి నుంచి డిజిటల్‌గా స్పష్టమైన అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడాన్ని నిషేధించడంతో పాటు, విదేశీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.