
దిల్లీలో ఆందోళనల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న నిరసనకారులు మరియు వివిధ పార్టీల నేతలందరినీ పోలీసులు విడుదల చేశారు.
సీజేపీ ప్రతినిధులను మాత్రం విడుదల చేయలేదని, వారి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన సీజేపీ ప్రతినిధి అజింక్య శిందే, ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతాయని ప్రకటించారు.