
‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదంలో సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పాటలోని ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని, సాహిత్యం మరియు సౌండ్ రికార్డింగ్‌పై కాపీరైట్ హక్కులు ఆయనకు చెందవని ధర్మాసనం తేల్చిచెప్పింది.
సరిగమ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.