
బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ తెలంగాణలో వేగంగా కొనసాగుతోంది.
14-15 ఏళ్ల వయసున్న బాలికలకు ఇస్తున్న ఈ టీకాల ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 67 శాతం లక్ష్యం పూర్తయింది.
జిల్లాల వారీగా జరిగిన ఈ వ్యాక్సినేషన్లో పెద్దపల్లి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, కరీంనగర్ చివరి స్థానంలో ఉంది.