
ఫ్రాన్స్‌లో కొద్ది రోజులుగా నిత్యావసర ధరలు, జీవన వ్యయం, నిరుద్యోగం వంటి అంశాలపై తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో ప్యారిస్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఫ్రాన్స్‌లో ఉంటున్న భారతీయులకు మరియు పర్యటించాలనుకునే వారికి కీలక సూచనలు జారీ చేసింది.
భారతీయులు రద్దీగా ఉండే ప్రదేశాలకు, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక ఫ్రెంచ్ అధికారుల సూచనలు పాటించాలని ఎంబసీ కోరింది.