
గుంటూరులో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో వైసీపీ నేత కంకర నరేంద్ర రెడ్డిని నల్లపాడు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
శ్రీనివాస యాదవ్‌ను హతమార్చడానికి నరేంద్ర రెడ్డి ఒక గ్యాంగ్‌కు రూ.1.5 కోట్ల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించి, నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
గతంలో వైసీపీ హయాంలో నరేంద్ర రెడ్డి చేసిన అరాచకాలను జనసేన నేత అడ్డుకోవడంతోనే ఈ హత్యకు కుట్ర జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.