
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పటాన్ చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన సుమారు 50 మందికి పైగా అంత్యక్రియల నిమిత్తం బస్సులో వెళుతుండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను వెంటనే స్థానికులు, అధికారులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.