
రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ డిసెంబర్ 8, 2014ను కటాఫ్ తేదీగా నిర్ణయించి స్పష్టతనిచ్చింది.
ఆ తేదీకి ముందే నిర్మాణాలున్న భూములు మరియు చదరపు గజాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే 6,473.72 ఎకరాలను ఎల్పీఎస్ నుంచి మినహాయించినట్లు సీఆర్డీఏ గుర్తుచేసింది.