
సోషల్ మీడియా ద్వారా ఒక మహిళ వలలో చిక్కి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రక్షణ రహస్యాలను లీక్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు తన సహోద్యోగి ఫోన్లో ప్రమాదకరమైన స్పైవేర్ యాప్ను ఇన్స్టాల్ చేసి, పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు కీలకమైన సైనిక కదలికల సమాచారాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో పంపాడు.
నిఘా విభాగం అందించిన సమాచారంతో మే 31న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.