
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు ఎనిమిది రోజుల గాలింపు తర్వాత అరెస్టు చేశారు.
మహిళా ఎస్సైపై దాడి చేసిన కేసులో నిందితుడు గత ఎనిమిది రోజులుగా ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం అతడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియను చేపట్టారు.