
ఆసియా క్రీడల్లో భారత క్రికెటర్లు నిర్వాహకులు కల్పించిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సెప్టెంబర్ 9న వెల్లడించారు.
జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.
వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్ వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు.