
స్థానిక ఎన్నికలపై వైఎస్సార్సీపీ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 27 నాటి ఉత్తర్వుల ఆర్డర్ కాపీని విడుదల చేసింది.
అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేస్తే న్యాయపోరాటానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికీ సీసీటీవీ కవరేజీని తప్పనిసరి చేసింది.
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూసేందుకు నామినేషన్ల కేంద్రాలు, పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూమ్‌లలో వీడియో ఫుటేజీని పిటిషన్ల గడువు ముగిసే వరకు భద్రపరచాలని ఆదేశించింది.