
హైదరాబాద్‌కు చెందిన జెన్ టెక్నాలజీస్ దేశంలోనే తొలి హై-ఆల్టిట్యూడ్ మ్యాన్-పోర్టబుల్ యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది.
పర్వత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో దళాల రక్షణ కోసం రూపొందించిన ఈ వ్యవస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్షన్, ఓమ్ని డైరెక్షనల్ జామింగ్ సాంకేతికత ఉన్నాయి.
ఈ తేలికపాటి వ్యవస్థను సైనికులు, ఆల్ టెరైన్ వెహికిల్స్ ద్వారా సులభంగా తీసుకెళ్లవచ్చని, ఇది 24 గంటలూ అన్ని వాతావరణాల్లో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.