
ఒరాకిల్‌లో తాజా లేఆఫ్‌ల తర్వాత ఆల్ హ్యాండ్స్ పేరిట నిర్వహించిన సమావేశంలో సీఎఫ్‌వో హిల్లరీ మాక్సన్ ఉద్యోగులతో భేటీ అయ్యారు.
కంపెనీ వృద్ధి స్థిరంగా ఉండాలంటే ఉద్యోగులు సమయం, డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేలాదిమంది ఉద్యోగులు ప్రభావితం కానుండగా, భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.