
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తగిన అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
వైభవ్‌ను తుది జట్టులో ఆడించకుండా బెంచ్‌పై కూర్చోబెట్టడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.