
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ సాంకేతికత వల్ల నిరుద్యోగం పెరగదని, భవిష్యత్తులో ఇది పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐ సహాయంతో చిన్న బృందాలు కూడా పెద్ద వ్యాపారాలను నిర్వహించగలవని ఆయన పేర్కొన్నారు.
మెటా సంస్థ ఇటీవల 8,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాల తర్వాత జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.