
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తమ పసిడి రుణాల పోర్ట్ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్ అంచనా వేశారు.
ప్రస్తుతం ఈ పోర్ట్ఫోలియో రూ. 1.25 లక్షల కోట్లుగా ఉందని, పసిడి రుణాల సెగ్మెంట్ 20 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మొత్తం రుణాల్లో రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ (RAM) వాటా 65 శాతంగా ఉండగా, మిగిలిన 35 శాతం కార్పొరేట్ రంగానికి చెందినవని బ్యాంక్ వివరించింది.