
10 అంగుళాల పిజ్జాకు బదులుగా 7 అంగుళాల పిజ్జాను డెలివరీ చేసినందుకు ఉత్తరాఖండ్ వినియోగదారుల కమిషన్ సదరు సంస్థకు రూ.10,520 జరిమానా విధించింది.
బాధిత కస్టమర్ చెల్లించిన రూ.505 పిజ్జా ధర, రూ.15 డెలివరీ ఛార్జీలతో పాటు, ఆవేదనకు రూ.5,000 మరియు వ్యాజ్య ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.
తాము కేవలం డెలివరీ సంస్థగా మాత్రమే వ్యవహరిస్తున్నామని, తయారీలో తమకు సంబంధం లేదని డెలివరీ ప్లాట్ఫామ్ వాదించినప్పటికీ కమిషన్ ఈ తీర్పునిచ్చింది.