
దేవుడి పేరుతో అమాయకులను నమ్మించి, బలవంతపు ఉపవాసాలు చేయించి 191 మందిని హత్య చేసిన కేసులో కెన్యా కోర్టు పాల్ మెకెన్సీ అనే పాస్టర్‌తో సహా 28 మందిని దోషులుగా నిర్ధారించింది.
మృతుల్లో 190 మంది చిన్న పిల్లలు ఉండటం ఈ కేసులోని అమానుషత్వాన్ని తెలియజేస్తోంది. దోషులకు నవంబర్ 6న శిక్ష ఖరారు చేయనున్నారు.
బయటి ప్రపంచం పాపభూయిష్టమని, అడవిలోనే మోక్షం లభిస్తుందని నమ్మించి, తన 800 ఎకరాల స్థలానికి రప్పించి, క్రమపద్ధతిలో మరణ శాసనాన్ని అమలు చేశాడు.