
హైదరాబాద్ జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఆదివారం ఉదయం మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఏడు బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తి మైనర్ అని స్థానికులు అనుమానిస్తుండగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, నిందితుడు మైనర్ అని తేలితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.