
మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన రమాబాయి రణవీర్ (47), తన ఇద్దరు కుమార్తెల చదువు కోసం పరుగు పందెంలో పాల్గొని విజేతగా నిలిచింది.
అంబాజోగైలో జరిగిన 3 కిలోమీటర్ల పరుగు పందెంలో చెప్పులు లేకుండానే పాల్గొని, మొదటి బహుమతిగా రూ. 3 వేలు మరియు ట్రోఫీని గెలుచుకుంది.
భర్త మరణం తర్వాత ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రమాబాయి, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ సాహసం చేసినట్లు తెలిపింది.