టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్) నివేదిక ప్రకారం దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య 134.8 కోట్లకు చేరుకుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో సంస్థ 3.26 కోట్ల మంది వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
5జీ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించడంతో వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.