
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన 'మ్యారథాన్ ఫ్యూషన్' సంస్థ అణు సంలీన (న్యూక్లియర్ ఫ్యూషన్) సాంకేతికతతో పాదరసాన్ని బంగారంగా మార్చగలిగామని ప్రకటించింది.
పాదరసం మూలకాన్ని శక్తివంతమైన న్యూట్రాన్లతో ఢీకొట్టి, ఐసోటోప్ మార్పుల ద్వారా ఈ ప్రక్రియను విజయవంతం చేసినట్లు సంస్థ తెలిపింది.
భవిష్యత్తులో ఫ్యూచర్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ఒక్కో ప్లాంటు ద్వారా ఏటా రెండు టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేసింది.