
ఐపీఎల్ ట్రేడింగ్ సమయంలో జరిగే ఆర్థిక లావాదేవీలను బీసీసీఐ బహిర్గతం చేయాలని, పారదర్శకత లేకపోవడం లీగ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని సునీల్ గావస్కర్ పేర్కొన్నారు.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వీడి కెప్టెన్సీ షరతుతో ఇతర జట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రతి ఫ్రాంచైజీకి ఉండే శాలరీ క్యాప్ నిబంధనలను ఇతర జట్లు నిర్ధారించుకోవాలంటే ట్రేడింగ్ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఆయన సూచించారు.
skip