
బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న రూ.10.5 లక్షల కోట్ల మిగులు నగదును నియంత్రించేందుకు ఆర్బిఐ సోమవారం వేలం నిర్వహించనుంది.
రూ.7 లక్షల కోట్లను 30 రోజుల పాటు వెనక్కి తీసుకునేందుకు 'వేరియబుల్ రేట్ రివర్స్ రెపో' వేలం ప్రక్రియను ఆర్బిఐ చేపట్టింది.
విదేశీ భారతీయుల నుంచి 127 బిలియన్ డాలర్ల డిపాజిట్లు రావడంతో వ్యవస్థలో నగదు ప్రవాహం పెరిగి వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి.