
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) స్పాట్ మార్కెట్ కొనుగోళ్లను 50 శాతం నుండి 84 శాతానికి పెంచింది.
హర్మూజ్ జలసంధి, ఎర్రసముద్రం మార్గాల్లో సరఫరా సమస్యల వల్ల రష్యా, పశ్చిమాఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాల నుండి దిగుమతులను పెంచుతున్నట్లు ఐఓసీ ఫైనాన్స్ డైరెక్టర్ అనూజ్ జైన్ తెలిపారు.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా రోజువారీ డేటాను నిశితంగా పరిశీలిస్తూ, ఇంధన సేకరణ కోసం ఐఓసీ తన వ్యూహాలను మార్చుకుంటూ వస్తోంది.