
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన 2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ రెండు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి.