
రాజధాని అమరావతిలో నూతనంగా చెస్ అకాడమీని ఏర్పాటు చేయాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి భావిస్తున్నారు.
ఈ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ తరఫున తగిన మద్దతు అందించాలని ఆమె మంత్రి నారా లోకేశ్‌ను కోరారు.
క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోరుతూ ఆమె ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.