
కనీస వసతులు కల్పించకుండా రేకుల షెడ్డులోనే వైద్య విద్యను కొనసాగిస్తున్నారంటూ జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి రెండో రోజు కూడా ఆందోళన చేపట్టారు.
కళాశాల ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా భవనాల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో సుమారు 750 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
తరగతి గదుల్లోనే లంచ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.