
ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండాలనే హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-25ను వెంటనే సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి పేర్కొన్నారు.
టీచర్లను తరగతి గదికి దూరం చేసే ఆన్‌లైన్ కార్యక్రమాలను, అధిక శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని ఫిట్‌మెంట్ ప్రకటించి అమలు చేయాలని కూడా వారు కోరారు.