
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో పోలింగ్ అనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లపాడు పోలీసులు అప్పిరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.