
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు, నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
యాదాద్రి ప్లాంట్లో సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగకపోవడంపై అధికారులను నిలదీసిన సీఎం, తక్షణమే కారణాలు చెప్పాలని ఆదేశించారు.
పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని గతంలో ఆదేశించినా అమలు కాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.