
తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
దానం నాగేందర్ పిటిషన్పై తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని వారు ఈ కేవియట్ ద్వారా కోరారు.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినప్పుడు కేవియట్ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి కానుంది.