
హెచ్‌సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరపున ఆడుతున్న తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 82 బంతుల్లో 126 పరుగులతో అజేయ శతకం సాధించారు.
ఆనంద్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సికింద్రాబాద్ క్లబ్ 39 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేయగా, వర్షం కారణంగా వీజేడీ పద్ధతిలో విజేతగా నిలిచింది.
డీజీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సీజన్‌లో ఆనంద్ ఆడిన తొలి లీగ్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.