
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములకు రూ.820 పెరిగి రూ.1,44,330కు, 22 క్యారట్ల బంగారం రూ.750 పెరిగి రూ.1,32,300కు చేరింది.
వెండి ధరలు కిలోకు రూ.2.35 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలు ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.