
చైనా ఇంజనీర్లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానుగా నడిచే సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేశారు.
మొబైల్ ద్వారా బటన్ నొక్కితే నేరుగా మన వద్దకు వచ్చే ఈ స్కూటర్, ఇంటెలిజెంట్ సెన్సార్ల సహాయంతో అడ్డంకులను గుర్తించి పక్కకు తప్పుకోగలదు.
ఎవరైనా ఢీకొట్టినా కిందపడిపోకుండా తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకునే సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.