ముడి చమురు ఎగుమతులతో సంపన్న దేశంగా ఉన్న సౌదీ అరేబియా, పవిత్రమైన మదీనా ప్రాంతంలో 110 మిలియన్ టన్నుల ముడి యురేనియం నిల్వలను కనుగొంది.
మదీనాలోని జబల్ సయిద్ ప్రాజెక్ట్‌లో జరిపిన ఖనిజ నిక్షేపాల అన్వేషణలో ఈ భారీ నిల్వలు బయటపడినట్లు సౌదీ ఎనర్జీ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించారు.
విజన్ 2030లో భాగంగా ముడి చమురుపైనే కాకుండా పౌర అణు విద్యుత్ ఉత్పత్తి కోసం దేశీయంగా యురేనియం వెలికితీయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది.