పిల్లల్లో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.
సాధారణ ఫ్లూ అని నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.