
2025 డిసెంబర్‌లో జరిగిన మెస్సీ ఈవెంట్ టికెట్ల కోసం చెల్లించిన 33 వేల మంది అభిమానులకు డబ్బులు తిరిగి ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్యక్రమ నిర్వహణలో గందరగోళం నెలకొనడంతో, రాష్ట్ర క్రీడల బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి ఈ వాపసు ప్రక్రియను చేపట్టారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించామని, 294 నియోజకవర్గాల్లో మినీ ఇండోర్ స్టేడియాలు నిర్మిస్తామని సీఎం వెల్లడించారు.