
రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఆంక్ష కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే మహా కుంభకోణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు.
ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.