
మహారాష్ట్రలోని భీవండి సామూహిక అత్యాచార కేసులో నిందితుడైన శైలేష్ పాటిల్ కన్నతల్లినే అతనికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
థానే జిల్లా భీవండిలో సెప్టెంబర్ 13న ఒక వివాహితపై ఈ సామూహిక అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది.
నిందితుడి తల్లి సులోచన పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడిని ఉరితీయాలని బహిరంగంగా కోరారు.