
పుదుచ్చేరిలో హెల్మెట్ ధరించకుండా, నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వయ్యాపురి మణికందన్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.1,500 జరిమానా విధించారు.
శనివారం అసెంబ్లీకి వెళ్తుండగా తూర్పు విభాగం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకటాచలపతి ఈ ఉల్లంఘనను గుర్తించి చర్యలు తీసుకున్నారు.
సీఎం కార్యాలయం ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించినా డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడం వల్లే తాను ద్విచక్ర వాహనంపై వెళ్లాల్సి వచ్చిందని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.