
మారుతీ సుజుకి ఇండియా ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది 30 శాతం వృద్ధిని సాధించాలని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే కంపెనీ 2.2 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించి, గత ఏడాది కంటే 58 శాతం వృద్ధిని నమోదు చేసింది.