
మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్ఆర్పై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.
ఈ దుర్ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
కూలీలతో వెళ్తున్న ట్రాలీ టైర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం పల్టీ కొట్టినట్లు అధికారులు గుర్తించారు.