
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసిన రిటైల్ మదుపరుల్లో 30 ఏళ్ల లోపు వయసున్న జెన్-జీ యువత వాటా 43 శాతంగా నమోదైంది.
ఈ విభాగంలో ట్రేడింగ్ చేసిన యువతలో 89 శాతం మంది నష్టాలను చవిచూడగా, 60 ఏళ్లు పైబడిన వారిలో 81 శాతం మంది నష్టపోయారని సెబీ అధ్యయనం తెలిపింది.
వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారిలో 88 శాతం మందికి డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో నష్టాలు ఎదురయ్యాయని సెబీ నివేదిక స్పష్టం చేసింది.